తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పోర్టు తన వెబ్సైట్లో విడుదల చేసింది.. ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకొని హాల్ టికెట్ తో పాటు నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను, గుర్తింపు కార్డు తో పరీక్షకు హాజరు కావాలి.
పరీక్షకు హాజరై అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఒక వెబ్ నోట్ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు దానిలో ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
నవంబర్ 23వ తేదీన రెండు షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించబోతున్నట్టు బోర్డు వెల్లడించింది. రెండు షిఫ్ట్ లో పరీక్ష ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి నార్మలైజేషన్ విధానం కూడా మార్కులకు అప్లై చేస్తామని బోర్డు తెలియజేసింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు, హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మరియు బోర్డు విడుదల చేసిన వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🏹 Official Website – Click here
ఈ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన 2050 పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత మరో 272 పోస్టులు కలిపి మొత్తం 2,322 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అభ్యర్థుల నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది.
🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.
- ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టుగా అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.
🔥 భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్య : 2,322
🔥 పరీక్ష విధానం :
- 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రశ్నలు అభ్యర్థులు అప్లై చేసిన ఉద్యోగాల అర్హతకు సంబంధించిన సిలబస్ నుండి ఇస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది..
- పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు.
- పరీక్ష ఇంగ్లీషులో మాత్రమే నిర్వహిస్తారు.
🔥 పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేట ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- అభ్యర్థులు తాము అప్లై చేసే సమయంలో పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.