తెలంగాణలో 2212 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల | భర్తీ చేయబోయే పోస్టులు ఇవే | Telangana Jobs Notifications 2024

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో మరో 2212 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి..

ఇందులో ఇప్పటికే 612 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. ఈ ఉద్యోగాలకు త్వరలో తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. అలాగే మరో 1600 ఉద్యోగాలకు ఆర్థిక శాఖకు అనుమతి కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 👇 👇 👇 

తెలంగాణలో వైద్య , ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. 

మరో పక్క చూస్తే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల్లో భారీగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ నుండి ఆర్థిక శాఖను అనుమతి కోరుతూ ప్రతిపాదనలు కూడా చేరాయి. ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే త్వరలో ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది.. కాబట్టి ఈ లెక్కన చూస్తే మరో 2212 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి అని స్పష్టం అవుతుంది.

ఇటీవల మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి..

🔥 తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వివరాలు – Click here

🔥 తెలంగాణ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వివరాలు – Click here 

🔥 తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!