Headlines

11 వేల అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | TG Anganwadi Jobs Recruitment 2024 | Telangana Anganwadi Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్రంలో భారీగా అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయడంతో పాటు భారీ సంఖ్యలో అంగన్వాడి టీచర్లు మరియు సహాయకులను భర్తీ చేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రస్తుతం మొదలుపెట్టింది. ఈ నియామకాల కోసం అతి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

పదవీ విరమణలు , పదోన్నతులు, రాజీనామాలు వంటి వివిధ కారణాలతో ప్రస్తుతం 11 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రతీ నెలా ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరుగుతూ ఉంది.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 11 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : మెయిన్ అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ మరియు మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లను జిల్లాల్లో ఉండే ఖాళీలను ఆధారంగా చేసుకుని భర్తీ చేస్తారు. 

🔥 అర్హతలు : అంగన్వాడీ టీచర్ తో పాటు సహాయకుల ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉన్నవారు అర్హులు.

  • ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు

🔥 వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 ఎంపిక విధానము : 

  • ఈ పోస్టులకు విద్యార్హతలో వచ్చిన మార్కులు , ఇంటర్వ్యూ మరియు ద్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!