పోస్టల్ GDS ఉద్యోగాలకు అప్లై చేసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎట్టకేలకు పోస్టల్ GDS ఫలితాలను పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్ కు సంబంధించిన ఫలితాలు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో ఇచ్చిన ఫలితాల PDF ని డౌన్లోడ్ చేసి తాము సెలెక్ట్ అయ్యామా లేదా అనేది తెలుసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులు సంబంధిత డివిజనల్ హెడ్ ఆఫీస్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సెప్టెంబర్ 3వ తేదీ లోపు హాజరయ్యి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
వెరిఫికేషన్ కి వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటేస్టేడ్ ఫోటో కాపీలతో వెళ్లాల్సి ఉంటుంది.
మొత్తం 44,228 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 1355 పోస్టులు, తెలంగాణ సర్కిల్ లో 981 పోస్టులు ఉన్నాయి . ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాగ్ సేవక్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 18 నుండి 40 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారికి అవకాశం ఇచ్చారు. (ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తించింది)
ఈ ఉద్యోగాలకు జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ కొనసాగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఆగస్టు 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ లో మార్పులు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
తాజాగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను ఎట్టకేలకు విడుదల చేశారు. ఫలితాలు చెక్ చేసుకునేందుకు క్రింద ముఖ్యమైన లింక్స్ ఇవ్వబడినవి. ఇచ్చిన లింక్ ఉపయోగించి GDS ఫలితాల PDF లు డౌన్లోడ్ చేయండి..
🔥 Download Andhra Pradesh Circle Results – Click here
🔥 Download Telangana Circle Results – Click here