తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3,035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే… ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీపై సంస్థ దృష్టి పెట్టింది. 12 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ చేపట్టబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా , వేగంగా నిర్వహించాలని సంస్థ భావిస్తుంది. గతంలో అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ ఈ సంస్థ చేపట్టింది. పదో తరగతి అర్హతతో కూడా పోస్టులు భర్తీ చేయబోతున్నారు..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
- డ్రైవర్ – 2,000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
- డిప్యూటీ మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
- మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 07
- మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 07
ఈసారి మాత్రం ఈ ఉద్యోగాల భర్తీ మూడు బోర్డుల ద్వారా జరగబోతుంది. ప్రస్తుతం అనుమతి ఇచ్చిన పోస్టులను మూడు రకాలుగా వర్గీకరించారు. తాజాగా భర్తీ చేసే పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
✅ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయబోయే పోస్ట్లు ఇవే :
- డ్రైవర్ – 2,000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
✅ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు ఇవే :
- డిప్యూటీ మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
✅ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు ఇవే :
- మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 07
- మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 07
ఈ తాజా ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకువెళ్లారు.