NIMS Hyderabad Technicians Notification 2026 : హైదరాబాదులో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 119 పోస్టులతో వివిధ డిపార్ట్మెంట్లలో టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హైదరాబాద్ లో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
వివిధ డిపార్ట్మెంట్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ చివరి తేదీ :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15వ తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
అర్హులైన అభ్యర్థులను పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ పోస్టులకు అప్లై చేయాలి. The Director, NIMS పేరు మీద DD తీసి అప్లికేషన్ కు జతపరచాలి.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు 32,500/- జీతము చెల్లిస్తారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
▶️ Download Notification – Click here
