AP లో మరో నోటిఫికేషన్ | 10th అర్హతతో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల | AP Contract / Outsourcing Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం 51 పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న , టీచింగ్ హాస్పిటల్స్ ,  గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 08 నుంచి నవంబర్ 14వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో 10వ తరగతి , ITI వంటి అర్హతలు ఉన్నవారికి కూడా పోస్టులు ఉన్నాయి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల పారామెడికల్ పోస్టులతో పాటు ఎక్కువ మంది నిరుద్యోగులకు అర్హత ఉండే ఆఫీస్ సభార్డినేట్ , అటెండర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. 

🔥 భర్తీ చేసే పోస్టులు : ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , స్పీచ్ తెరపిస్ట్ , బయోమెడికల్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్ , ఓటి టెక్నీషియన్ , ఆఫీస్ సబర్డినేట్ , ప్లంబర్ , స్టోర్ అటెండర్ .

🔥 ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వయసులో వయో సడలింపు ఇస్తారు. 

🔥 ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..

🔥 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో కనీసం 15 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలతో పాటు గరిష్టంగా 40,970/- వరకు జీతం వచ్చే పోస్టులు కూడా ఉన్నాయి.

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 32,670/-

స్పీచ్ తెరపిస్ట్ – 40,970/-

బయోమెడికల్ టెక్నీషియన్ – 32,670/-

కార్డియాలజీ టెక్నీషియన్ – 32,670/-

ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 – 22,460/-

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – 37,640/-

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-

ల్యాబ్ అటెండెంట్ – 15,000/-

ఓటి టెక్నీషియన్ – 22,460/-

ఆఫీస్ సబర్డినేట్ – 15,000/-

ప్లంబర్ – 15,000/-

స్టోర్ అటెండర్ – 15,000/-

🔥 ఈ పోస్టులకు ఓసి అభ్యర్థులు అయితే 250/- ఫీజు చెల్లించి అప్లై చేయాలి .

మిగతా రిజర్వేషన్స్ కలిగిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

🔥 ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.

🔥 ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 30వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.

🔥 ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులకు Acknowledgement ఇవ్వబడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!