హైకోర్ట్ లో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana High court Driver Jobs Recruitment 2026

Telangana High Court Driver Jobs Apply Process
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

TG High Court Driver Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు అనగా 33 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష ఉండదు. స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా తమ అప్లికేషన్ ఫిబ్రవరి 28వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి..

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి విడుదలైంది..

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి.

లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

తెలుగు చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు DD రూపంలో చెల్లించాలి.

వయస్సు వివరాలు :

01-07-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 46 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

జీతము వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు 22,900/- నుండి 69,150/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము చెల్లిస్తారు..

ఎంపిక విధానం వివరాలు :

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాత లేదు.. స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏప్రిల్ నెలలో డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ : 02-02-2026

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-02-2026

అప్లికేషన్ చివరి తేదీ : 28-02-2026

స్కిల్ టెస్ట్ : ఏప్రిల్ 2026

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

▶️ Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *