Headlines

తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Recruitment 2026

Telangana Outsourcing Jobs Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Telangana Outsourcing Jobs Apply : తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీలోపు అప్లై చేయాలి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, DMLT / MLT వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు తెలుసుకున్నాక అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 5వ తేదీలోపు అప్లై చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎనిమిది రకాల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, క్లీనర్, లైబ్రరీ అసిస్టెంట్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలు కలిపి మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, DMLT / MLT వంటి విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. ( ఉద్యోగాల వారీగా అర్హతలు వివరాలు తెలుసుకునేందుకు పూర్తి నోటిఫికేషన్ చదవండి)

పోస్టుల వారీగా జీతం వివరాలు :

అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 19,500/- రూపాయలు జీతం ఇస్తారు.

ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 19,500/- రూపాయలు జీతం ఇస్తారు.

హౌస్ కీపర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,600/- రూపాయలు జీతం ఇస్తారు.

ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,600/- రూపాయలు జీతం ఇస్తారు.

రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 19,500/- రూపాయలు జీతం ఇస్తారు.

క్లీనర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,600/- రూపాయలు జీతం ఇస్తారు.

లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,600/- రూపాయలు జీతం ఇస్తారు.

డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 19,500/- రూపాయలు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీలోపు అప్లై చేయాలి.

వయస్సు వివరాలు :

01-01-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అంగవైకల్యం ఉన్న అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.

స్థానికత వివరాలు :

ఒకటవ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏవైనా నాలుగు సంవత్సరాలు వరుసగా జగిత్యాల జిల్లాలో చదివి ఉండాలి. దీని కోసం స్టడీ సర్టిఫికెట్లు జతపరచాలి.

రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనికోసం అభ్యర్థులు తహసిల్దార్ కార్యాలయం నుండి పొందిన కుల ధ్రువీకరణ పత్రం జతపరచాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

అర్హులైన అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ మరియు అవసరమైన అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతపరిచి జగిత్యాల లో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో అందజేయాలి.

Download Notification – Click here

✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు అప్లై చేసేముందు పైన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *