Anganwadi Jobs Vacancies in Telangana : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 15,274 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పదో తరగతి , ఇంటర్మీడియట్ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం కల్పిస్తారు. త్వరలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని సమాచారం.
అభ్యర్థుల అవగాహన కోసం అర్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు సమాచారం క్రింద తెలుపబడినవి..
Table of Contents :
▶️ నోటిఫికేషన్ విడుదల చేసే సంస్థ :
రి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విడుదల చేస్తుంది.
భర్తీ చేసే ఉద్యోగాలు :
మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేయబోయే ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేయబోయే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15,274 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
అర్హతలు వివరాలు :
ఏడవ తరగతి లేదా పదో తరగతి అర్హతతో అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
ఇంటర్మీడియట్ విద్యార్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రదేశంలో స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
వయస్సు వివరాలు :
21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవకాశం కల్పిస్తారు.
ఎంపిక విధానం :
వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందజేయడం జరిగింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఈసారి భర్తీ చేయబోయే అంగన్వాడీ ఉద్యోగాలను రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
అప్లికేషన్ తేదీలు వివరాలు :
ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుంది. త్వరలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. విడుదల కాబోయే ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ తేదీలు, అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ విధానము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలు మరియు వాటిల్లో జిల్లాల వారీగా ఖాళీలతో పాటు ఇతర వివరాలు ప్రకటించబోతున్నారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. త్వరలో విడుదల చేయబోయే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మా వెబ్సైట్ మరియు వాట్సాప్ , టెలిగ్రామ్ చానల్స్ ద్వారా కూడా మీకు తెలియజేస్తాము. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
▶️ Telangana WDCW Department Website – Click here
