పదో తరగతి అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీ | Indian Air Force Agniveervayu Non-Combatant Recruitment 2026

Indian Air Force Air Combatant Syllabus
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Indian Air Force Agniveervayu Non-Combatant Notification 2026 : దేశ రక్షణలో కీలక పాత్ర వహించే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా అగ్నిపత్ స్కీం లో భాగంగా AGNIVEERVAYU NON-COMBATANT పోస్టులు భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు కేవలం పదవ తరగతి పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 134 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, ఎయిర్ ఫోర్స్ అకాడమీలు మరియు ఇతర ఎయిర్ ఫోర్స్ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడినది.

ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరీ తెలంగాణ రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానము, జీతం, అప్లికేషన్ విధానం, అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు మరియు ఇతర వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం ప్రతిరోజు తెలుసుకున్నందుకు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో వెంటనే జాయిన్ అవ్వండి.

Indian Air Force Agniveervayu నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి విడుదల చేయబడింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

అగ్నిపథ్ స్కీములో భాగంగా AGNIVEERVAYU NON-COMBATANT పోస్టులు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.

నోటిఫికేషన్ ద్వారా హాస్పిటాలిటీ మరియు హౌస్ కీపింగ్ విభాగాలు పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతలు :

పదో తరగతి పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయవచ్చు.

ఇతర అర్హతలు :

ఈ ఉద్యోగాలకు వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అభ్యర్థులు కనీసం 152 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. తగినంత ఛాతి మరియు ఎత్తుకు తగ్గ బరువు కలిగి ఉండాలి. మెడికల్ గా ఫిట్ గా ఉండాలి.

వయస్సు వివరాలు :

02-07-2005 నుండి 02-01-2009 మధ్య పుట్టిన తేదీ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయసుపరంగా అర్హులు.

అభ్యర్థులు ఎంపిక విధానం :

అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు, మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించవచ్చు. లేదా స్వయంగా వెళ్లి నోటిఫికేషన్లో తెలిపిన అడ్రస్ లో డ్రాప్ బాక్సులో వేయవచ్చు. అభ్యర్థులు తాము అప్లై చేయాలి అనుకున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లేదా ఎయిర్ ఫోర్స్ అకాడమీ కు అప్లై చేయవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కు పబ్లికేషన్ పంపించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతము వివరాలు :

ఎంపికైన అభ్యర్థులు 4 సంవత్సరాలు పాటు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ పథకం కింద చేరిన అగ్నివీర్ వాయు పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు ₹ 30,000/- అగ్నివీర్ ప్యాకేజీని స్థిర వార్షిక ఇంక్రిమెంట్‌తో చెల్లిస్తారు.

మొదటి సంవత్సరం నెలకు 30,000/- రూపాయలు చొప్పున జీతము చెల్లిస్తారు.

రెండవ సంవత్సరం నెలకు 33,000/- రూపాయలు చొప్పున జీతము చెల్లిస్తారు.

మూడవ సంవత్సరం నెలకు 36,500/- చొప్పున జీతము ఇస్తారు.

నాలుగవ సంవత్సరంలో నెలకు 40,000/-చొప్పున జీతము ఇస్తారు.

అదనంగా, రిస్క్ మరియు కష్ట భత్యాలు (IAFలో వర్తించే విధంగా) మరియు డ్రెస్ మరియు ప్రయాణ భత్యాలు చెల్లించబడతాయి. రేషన్, దుస్తులు, వసతి మరియు సెలవు ప్రయాణ రాయితీ (LTC) వంటి ప్రోత్సాహకాలను కూడా ప్రస్తుత నిబంధనల ప్రకారం అందించాలి.

అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపిక అయ్యి వారి సర్వీసు పూర్తయిన తర్వాత ప్రభుత్వం వారి నెలవారీ సహకారంతో పాటు సరిపోయే సహకారంతో కూడిన ఒకేసారి ‘సేవా నిధి’ ప్యాకేజీని అందిస్తుంది.

సేవా నిధి ప్యాకేజీగా సుమారు ₹ 10.04 లక్షలు (వడ్డీని మినహాయించి సంపూర్ణ మొత్తం) ఇస్తారు.

Download Notification – Click here

✅ ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *