హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Hyderabad Passport Office Recruitment 2026

Hyderabad Passport Office Young Professional Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Hyderabad Passport Office Young Professional Recruitment 2026 : హైదరాబాదులో ఉన్న ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఖాళీలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించి అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజుల్లో అప్లై చేయాలి అని నోటిఫికేషన్ లో తెలియజేశారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలను తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఆర్టికల్ చివరిలో మీకోసం పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది.

నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 21-01-2026 తేదీన విడుదల చేయబడినది.

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెందిన పాస్పోర్ట్ ఆఫీస్, హైదరాబాద్ క్రాంతి కార్యాలయం నుండి విడుదల చేయబడింది..

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ అనే ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు.

దరఖాస్తు విధానం :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు తమ అప్లికేషన్ను మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చు.

అర్హతల వివరాలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ప్రభుత్వ సంస్థలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.

జీతము వివరాలు :

డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి నెలకు 50 వేల రూపాయలు జీతం ఇస్తారు.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉన్నవారికి నెలకు 60 వేల రూపాయలు జీతం ఇస్తారు.

వయస్సు వివరాలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.

పోస్టింగ్ ప్రదేశము :

హైదరాబాదులో ఉన్న ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ఎంపికైన వారికి పోస్టింగ్ ఇస్తారు.

అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు :

ఎంపికైన వారికి ఆఫీస్ విధులు నిర్వహించే పనిలో భాగంగా వేరే ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఎయిర్ అకానమీ లేదా రైల్ ఏసీ 2 టైర్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తారు.

హోటల్ లేదా అకాడమీషన్ కోసం రోజుకు 750 రూపాయల వరకు చెల్లిస్తారు.

టాక్సీ చార్జీలు 225 రూపాయల వరకు చెల్లిస్తారు.

ఫుడ్ బిల్లులు కోసం 800 రూపాయలు వరకు చెల్లిస్తారు.

అప్లై చేయు విధానము :

అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

నోటిఫికేషన్ విడుదల చేసిన జనవరి 21వ తేదీ నుండి 21 రోజుల్లోపు. మెయిల్ లేదా పోస్టు ద్వారా అప్లికేషన్ ద్వారా పంపించాలి.

మీల్ ద్వారా పంపడానికి మెయిల్ అడ్రస్ : rpo.hyderabad@cpo.gov.in

పోస్ట్ ద్వారా పంపడానికి అడ్రస్ :

the Senior Superintendent
(Admn.), Regional Passport Office, D.No. 8-2-215 to 219, Near Clock Tower, Adjacent to
Prashanth Theatre, Kummarguda, Secunderabad – 500003, Telangana State.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రిందకి ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు స్పష్టంగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *