ప్రభుత్వ స్కూల్ లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Govt School Non Teaching Jobs

Sainik school Amaravathinagar Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Govt Sainik School Notification 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ (sainik School) నుండీ సొసైటీ నుండి సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

పదో తరగతి , ఇంటర్ వంటి విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్, అమరావతినగర్ నుండి విడుదల అయ్యింది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ ఎంప్లాయ్ (MTS) ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో మరియు PEM / PTI కం మెట్రోన్ (Female), వార్డ్ బాయ్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు వివరాలు :

పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ వంటి అర్హతలు ఉన్న వారు అప్లై చేయుటకు అర్హులు. అర్హతల పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు

SC / ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 200/- రూపాయలు

PRINCIPAL, SAINIK SCHOOL, AMARAVATHINAGAR అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

జీతము వివరాలు :

జనరల్ ఎంప్లాయ్ (MTS) ఉద్యోగాలకు అప్లికేషన్ 18,000/- నుండి 56,900/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతము చెల్లిస్తారు.

PEM / PTI కం మెట్రోన్ (Female) ఉద్యోగాలకు 25,000/- జీతం చెల్లిస్తారు.

వార్డ్ బాయ్ ఉద్యోగాలకు అనుభవం ఆధారంగా 22,000/- నుండి 25,000/- వరకు జీతం చెల్లిస్తారు.

ఎంపిక విధానం వివరాలు :

ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ 2026 ఏప్రిల్ 3వ వారంలో నిర్వహిస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ :

31-03-2025 తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :

PRINCIPAL
Sainik School, Amaravathinagar
Udumalpet Taluk, Tiruppur District
Tamil Nadu – 642 102

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసేందుకు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేయండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.

✅ Full Notification Details & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *