ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీ | ESIC IMO Notification 2026

ESIC IMO Selection Process
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ESIC IMO Notification 2026 : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుండి ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 225 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 17వ తేదీ లోపు పోస్ట్ ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని రకాల అర్హతలు ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర వివరాలు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పోస్ట్ ద్వారా పంపడం ద్వారా అప్లై చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థల నుంచి విడుదలైంది.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2025 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

తప్పనిసరిగా ఇంటర్నర్షిప్ పూర్తి చేసి ఉండాలి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2024 పరీక్ష రాసి ప్రతిభా సేతు పోర్టల్ లో ఉన్న లిస్టులో పేరు ఉండాలి.

వయస్సు వివరాలు :

01-08-2024 తేదీ నాటికి వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి..

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST, OBC, PWD, ex serviceman మరియు ఇతరులకు వయసులో సడలింపు ఉంటుంది.

జీతం వివరాలు :

పే మ్యాట్రిక్స్‌లో లెవల్-10 (రూ. 56,100 – 1,77,500) ప్లస్ నాన్-ప్రాక్టీసింగ్ కేంద్ర ప్రభుత్వంలో సారూప్య పదవికి అనుమతించదగిన భత్యం. పేతో పాటు వారు DA, NPA లకు కూడా అర్హులు.

అభ్యర్థుల ఎంపిక విధానము :

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2024 లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నింపి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ జతపరిచి పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలి.

అప్లికేషన్ చివరి తేదీ :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 17వ తేదీలోపు తమ అప్లికేషన్ చేరే విధంగా పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ పంపించవలసిన చిరునామా :

అప్లై చేసే అభ్యర్థులు తాము పంపించే అప్లికేషన్ ఎన్వలప్ కవర్ పైన “Application for
the post of IMO Gr. II in ESIC” అని తప్పనిసరిగా రాయాలి.

అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ :

The Joint Director (Recruitment),
ESI Corporation, Panchdeep Bhawan,
CIG Marg, New Delhi-110002.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింది ఇచ్చిన నోటిఫికేషన్ లింకు పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసే ముందు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు మీరు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మా వెబ్సైట్ www.inbjobs.com వెబ్సైట్ ఓపెన్ చేయండి.

Download Full Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *