Visakhapatnam DRDO NSTL JRF Notification 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఫెలోషిప్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఫిబ్రవరి 26వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు.
ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
వి విశాఖపట్నంలో ఉన్నడిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL) నుండి e నోటిఫికేషన్ విడుదల చేశారు .
భర్తీ చేస్తున్న పోస్టులు :
విశాఖపట్నం NSTL లో జూనియర్ రీసెర్చ్ ఫెలోల పోస్టులు వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న పోస్టుల్లో మెకానికల్ ఇంజనీరింగ్ లో 03 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో 02 పోస్టులు, కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ లో 01 పోస్టు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో 01 పోస్టు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
సంబంధిత ప్రొఫెషనల్ కోర్సులో గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.E./ B.Tech) మొదటి డివిజన్‌తో మరియు చెల్లుబాటు అయ్యే NET/GATE స్కోరు కలిగి ఉండాలి. (లేదా)
సంబంధిత ప్రొఫెషనల్ కోర్సులో (M.E./M.Tech) గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.
వయస్సు వివరాలు :
గరిష్ట వయసు 28 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు
వయస్సులో సడలింపు వివరాలు :
ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం వివరాలు :
అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 26వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పారితోషకం క్రింద నెలకు 37 వేల రూపాయలు ఇస్తారు. ఇంటి భత్యం కూడా అదనంగా చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
రూ. 10/- పరీక్ష రుసుమును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా DD ద్వారా చెల్లించాలి. “ది డైరెక్టర్, NSTL” పేరుతో డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ విశాఖపట్నం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యేవిధంగా చెల్లించాలి లేదా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. SC / ST / OBC అభ్యర్థులకు ఈ ఫీజు లేదు..
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
నావల్ సైన్స్ & టెక్నలాజికల్ ప్రయోగశాల, విజ్ఞాన్ నగర్, N.A.D. జంక్షన్ దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – 530 027
✅ Download Full Notification & Application – Click here
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత ఉంటే హాజరు అవ్వండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
