District Court Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి మరియు డిగ్రీ విద్యార్హతలతో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ ఆర్డినేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
✅ ప్రభుత్వ విద్యా సంస్థలో ఉద్యోగాలు భర్తీ – Click here
Table of Contents
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
- రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన వారు అప్లై చేయడానికి అర్హులు.
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి మరియు కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు :
అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఓసి మరియు బీసీ అభ్యర్థులు 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, PH మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఫీజు రూపంలో చెల్లించాలి.
వయసు వివరాలు :
- 01-01-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసులో ఐదేళ్లు సడలింపు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వర్తిస్తుంది.
- PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీతభత్యముల వివరాలు :
- ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ 25,220/- నుండి 80,910/- ప్రకారం జీతం చెల్లిస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ 28,280/- నుండి 89,720/- ప్రకారం జీతం చెల్లిస్తారు.
- రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ 23,120/- నుండి 74,770/- ప్రకారం జీతం చెల్లిస్తారు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ కం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్స్, విశాఖపట్నం.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Data Entry Operator Notification – Click here
▶️ Download Record Assistant Notification – Click here
▶️ Download Front Office Co Ordinator Notification – Click here
