AIIMS Mangalagiri Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా “PALLIATIVE CARE OUTREACH SERVICES PROJECT” అనే ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానము, జీతం , అప్లికేషన్ విధానం మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ నుండి విడుదల అయ్యింది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజియోథెరపిస్ట్ మరియు సోషల్ వర్కర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అర్హత కలిగి ఉండి సంబంధిత అనుభవం కలిగి ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
సోషల్ వర్కర్ ఉద్యోగానికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అర్హత కలిగి ఉండాలి.
జీతము వివరాలు :
ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 40,000/- రూపాయలు జీతం ఇస్తారు.
సోషల్ వర్కర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 25,000/- రూపాయలు జీతం ఇస్తారు.
వయస్సు వివరాలు :
ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి వయస్సు 40 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.
సోషల్ వర్కర్ ఉద్యోగానికి వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
ప్రోజెక్ట్ కాలపరిమితి :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిని 6 నెలలు కాలపరిమితి కోసం నియమించుకుంటారు.
ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి అభ్యర్థులను కొనసాగిస్తారు.
ఇంటర్వ్యూ జరిగే తేదీ మరియు ప్రదేశం :
గ్రౌండ్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, AIIMS మంగళగిరిలో ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు హాజరు కావాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రాత పరీక్షలు నిర్వహించవచ్చు.
అర్హత ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూకు అవసరమయ్యే డాక్యుమెంట్స్ వివరాలు :
వయస్సు రుజువు (SSC సర్టిఫికేట్/ 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్)
విద్యా అర్హతల సర్టిఫికెట్లు (స్వీయ-ధృవీకరించబడిన ఫోటో కాపీల సెట్‌తో)
2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్, ఆధార్ / పాన్ కార్డ్ / పాస్‌పోర్ట్/ ఓటరు ఐడి
అప్డేటెడ్ CV
✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి.. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం ప్రతీ రోజూ తెలుసుకోవడానికి మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
▶️ Download Full Notification – Click here
