AIIMS Mangalagiri Contract Jobs Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు జిల్లాలో పిల్లలలో రక్తంలో సీసం స్థాయిలను అంచనా వేసే జాతీయ స్థాయి బహుళ కేంద్ర అధ్యయనం అనే ప్రాజెక్ట్ లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి extramuralif@gmail.com అనే మెయిల్ ఐడికి అప్లికేషన్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ జత పరిచి పంపించాలి. మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు కూడా హాజరు కావాలి.
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – III, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – II, ప్రాజెక్ట్ నర్స్ – III అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో 11 నెలల కాల పరిమితికి భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కి అవసరం మరియు అభ్యర్థి పని తీరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఉద్యోగాల అర్హతల వివరాలు :
నోటిఫికేషన్ లో క్రింది తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సు వివరాలు :
13-03-2026 తేదీ నాటికి వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 05 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం :
అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జత పరిచి 12-03-2026 తేదీలోపు పంపించాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ :
అప్లై చేసిన అభ్యర్థులు 13-03-2026 తేదీ ఉదయం 8 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో స్వయంగా హాజరు కావాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
Administration Block, AIIMS Mangalagiri
ఎంపిక విధానం :
అర్హత గల అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
జీతము వివరాలు :
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – III, ప్రాజెక్ట్ నర్స్ -III ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 28,000/- జీతము మరియు HRA ఇస్తారు.
ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – II ఉద్యోగానికి ఎంపిక వారికి నెలకు 18,000/- జీతము మరియు HRA ఇస్తారు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు అవ్వండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
✅ Download Full Notification & Application – Click here
