ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పదో తరగతి ఫలితాలు విడుదలపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 23వ తేదిన పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు.
పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేది ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు.
పరీక్ష ఫలితాలను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ ద్వారా పదో తరగతి ఫలితాలు :
పాఠశాల విద్యాశాఖ యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా పదో తరగతి ఫలితాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి ” Hi ” అని మెసేజ్ పంపించి , పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ సులభంగా తెలుసుకోవచ్చు.
👉 Official Website – Click here