ఏపీలో రిజర్వేషన్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ | AP Sports Quota Reservations New G.O | AP Latest News

ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ కోటా ఆధారిత నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది.

ఉద్యోగ అవకాశాలలో గతంలో 2 శాతం గా ఉన్న రిజర్వేషన్ ను 3 శాతానికి పెంచుతూ G.O విడుదల అయ్యింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇచ్చేందుకు గాను ఈ G.O అవకాశం కల్పిస్తుంది.

ఈ G.O కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోగలరు.

🔥 స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపు :

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలను పొందేందుకు స్పోర్ట్స్ కోటా లో రిజర్వేషన్ ను 2 శాతం నుండి 3 శాతం కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

దీనికి సంబంధించి తేది : 19/04/2025 న G.O Ms.NO.04 ను విడుదల చేశారు.

ఈ G.O ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీలో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా వారికి లభిస్తుంది.

🔥 ఏ ఏ ఉద్యోగాలకు ఈ G.O వర్తిస్తుంది? : 

ఈ G.O ద్వారా ప్రభుత్వ సంస్థలలో, స్థానిక సంస్థలలో , పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ లలో మరియు యూనిఫాం సర్వీసులు అయిన పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లలో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ను 3 శాతానికి పెంచారు.

స్పోర్ట్స్ పాలసీ 2024-29 లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 మార్గదర్శకాలు :

రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తుది మెరిట్  జాబితా ఆధారంగా ఏపీపీఎస్సీ / సంబంధిత బోర్డు / సంబంధిత శాఖ ద్వారా ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారిత 3 శాతం రిజర్వేషన్ ద్వారా అర్హత కలిగిన మెడిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ వారికి అవకాశం కల్పిస్తుంది.

ఈ G.O ద్వారా ప్రభుత్వ సంస్థలలో, స్థానిక సంస్థలలో,పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ లలో మరియు యూనిఫాం సర్వీసులు అయిన పోలీస్ , ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగాలు కల్పిస్తారు.

శారీరక విద్య మరియు క్రీడలకు సంబంధించిన పోస్టులు, అనగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET), కోచ్‌లు, B.PED, డిప్లొమా ఇన్ కోచింగ్ (NIS రెగ్యులర్) వంటి ముఖ్యమైన అర్హత(లు)ను  అవసరాన్ని బట్టి  స్పోర్ట్స్ కోటా కింద నియామకం కోసం తాత్కాలికంగా సడలిస్తారు.

గ్రూప్-I సర్వీసులలోని పోస్టులకు అర్హత ఉన్న క్రీడాకారుడు గ్రూప్-II & గ్రూప్-III సర్వీసులలోని పోస్టులకు కూడా అర్హత  కలిగి ఉంటారు.

🔥 క్రీడా విభాగాల జాబితా :

ఈ క్రింద పేర్కొన్న క్రీడలలో ప్రతిభావంతులు అయిన  అర్హత కలిగిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

🔥 ముఖ్యమైన అంశాలు :

గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. అర్హత మరియు వయస్సు ఉంటే ఎప్పుడూ అయినా నోటిఫికేషన్ వస్తె  , జాతీయ మరియు అంతర్జాతీయ పథకాలు సాధించిన వారు అర్హత సాధించిన వారు ఈ రిజర్వేషన్ పొందేందుకు అర్హులే.

సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.

👉  Click here to download G.O

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!