తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 22వ తేదీ అనగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు విడుదల చేయబోతున్నట్లుగా ఇంటర్మీడియట్ బోర్డు కృష్ణ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,50,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
ఫలితాలను విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి తెలుసుకోవచ్చు.
🏹 Official Website – Click here