పదో తరగతి విద్యార్థులు , తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 23వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు , 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు.
పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి వివరాలు కొరకు మన ఆర్టికల్ చివరి వరకు చదవండి.
పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన వివిధ అవకాశాలు ద్వారా మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు.
🔥 ఫలితాలు చెక్ చేసుకొనే విధానం :
పరీక్ష ఫలితాలను విద్యార్థులు & తల్లితండ్రులు సులభంగా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 కి Hi అని మెసేజ్ చేసి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్ ద్వారా :
పాఠశాల విద్యాశాఖ యొక్క అధికారిక వెబ్సైట్ లో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
👉 Official Website – Click here