ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ డిపార్ట్మెంట్ వారి నుండి మిషన్ వాత్సల్య పథకం నందు కాంట్రాక్ట్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా కౌన్సిలర్ (ఫీమేల్), సోషల్ వర్కర్ (మేల్) , డేటా అనలిస్ట్ , ఔట్ రీచ్ వర్కర్, పార్ట్ టైమ్ డాక్టర్, సోషల్ వర్కర్, ఆయా, చౌకీదార్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారు తిరుపతి నందు గల డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలిజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (శిశు గృహ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నందు పనిచేయాల్ వుంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ వారి నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య:
అన్ని విభాగాలలో కలిపి మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఆయా పోస్ట్లు 4 , మిగతా అన్ని ఉద్యోగాలు ఒక్కొక్కటి భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
కౌన్సిలర్ (ఫీమేల్ )
సోషల్ వర్కర్ (మేల్)
డేటా అనలిస్ట్
ఔట్ రీచ్ వర్కర్
పార్ట్ టైమ్ డాక్టర్
ఎర్లీ చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్
ఆయా
చౌకీదార్
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత:
కౌన్సిలర్ (ఫీమేల్) : సోషల్ వర్క్ / సోషియాలజీ / సైకాలజీ / పబ్లిక్ హెల్త్ / కౌన్సెలింగ్ విభాగంలో డిగ్రీ లేదా కౌన్సెలింగ్ మరియు కమ్యూనికేషన్ లో పీజీ చేసి వుండాలి. ఒక సంవత్సర పని అనుభవం కలిగి వుండాలి.
సోషల్ వర్కర్ (మేల్) : సోషల్ వర్క్, సోషియాలజీ ,సోషల్ సైన్సెస్ లో డిగ్రీ / B.A ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
డేటా అనలిస్ట్: స్టాటిస్టిక్స్ / మాథెమాటిక్స్ / ఎకనామిక్స్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి వుండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
ఔట్ రీచ్ వర్కర్ : 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి, మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి వుండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
పార్ట్ టైమ్ డాక్టర్ : ఎంబిబిఎస్ తో పాటు పెడియాట్రిక్స్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేసి వుండాలి.
ఎర్లీ కం చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్ : సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / బ్యాచిలర్ డిగ్రీ లేదా సైకాలజీ / ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ మరియు డెవలప్మెంట్ లో పీజీ డిప్లొమా కలిగి వుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం కలిగి వుండాలి.
ఆయా (ఫిమేల్) : శిశువులు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలను చూసుకొనే అనుభవం కలిగి వుండాలి.
చౌకీదార్ (ఫిమేల్) : గతంలో ఎలాంటి నైతిక దుర్బలత్వం లేని నిబద్ధత మరియు చురుకైన వ్యక్తి మరియు మద్యం తాగడం, గుట్కా నమలడం వంటి అదనపు పదార్థాలు లేని వ్యక్తి.
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ వున్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
🔥 వయస్సు :
18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కొరకు తేది ను 15/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో ప్రస్తావించిన ఫార్మేట్ ను ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి, కార్యాలయ చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా నేరుగా అందచేయాలి.
🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :
పదవ తరగతి సర్టిఫికెట్
ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు
స్టడీ సర్టిఫికెట్లు (4 తరగతి నుండి 12వ తరగతి వరకు)
కుల ధ్రువీకరణ / EWS / వికలాంగ సర్టిఫికెట్
ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్
ఆధార్ కార్డు
🔥దరఖాస్తు అందచేయవలసిన చిరునామా:
డిస్ట్రిక్ట్ వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ రూమ్ నెంబర్ : 506 , 5వ ఫ్లోర్, బి – బ్లాక్ , కలెక్టరేట్,తిరుపతి
🔥 దరఖాస్తు ఫీజు:
బ్యాంకు చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డిస్ట్రిక్ట్ వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ పేరు మీదుగా తిరుపతి లో పే చేయాలి.
జనరల్ అభ్యర్థులు 250/- రూపాయలు & ఎస్సీ, ఎస్టీ, బీసీ, అభ్యర్థులు 200/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం:
కౌన్సిలర్ (ఫీమేల్),సోషల్ వర్కర్ (మేల్),డేటా అనలిస్ట్,ఎర్లీ చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్,అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రొఫిసియన్సీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
మిగతా అన్ని ఉద్యోగాలకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ,ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
కౌన్సిలర్ (ఫీమేల్ ), సోషల్ వర్కర్ (మేల్), డేటా అనలిస్ట్, సోషల్ వర్కర్ గా ఎంపిక అయిన వారికి నెలకు 18,536/- రూపాయల జీతం లభిస్తుంది.
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఎంపిక అయిన వారికి 13240/- రూపాయల జీతం లభిస్తుంది.
ఔట్ రీచ్ వర్కర్ గా ఎంపిక అయిన వారికి 10,592/- రూపాయల జీతం లభిస్తుంది.
పార్ట్ టైం డాక్టర్ గా ఎంపిక అయిన వారికి 9,930/- రూపాయల జీతం లభిస్తుంది.
ఆయా, చౌకీదార్ గా ఎంపిక అయిన వారికి 7,944/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆఫ్లైన్ విధానం (పోస్ట్ లేదా నేరుగా) ద్వారా 15/04/2025 నుండి 30/04/2025 సాయంత్రం 05:30 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
👉 Click here to download notification
👉 Click here for official website