ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేందుకు గాను జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి వారు నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్, ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోవాలి.
11 నెలలకు గాను పనిచేసేందుకు ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పటికీ , తరువాత పొడిగించబడతుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , జీతం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ , కృష్ణా జిల్లా నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
ఈ క్రింది విభాగాలలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్సల్టెంట్
ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ కన్సల్టెంట్
ద్రవ వ్యర్థాల మేనేజ్మెంట్ కన్సల్టెంట్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ : కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి మరియు కంప్యూటర్ రంగంలో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ :
సైన్స్ / సోషల్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
ద్రవ వ్యర్థాల నిర్వహణ కన్సల్టెంట్ : సైన్స్ / సోషల్ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 గరిష్ట వయస్సు :
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామా కు నేరుగా లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
తేది :30/04/2025 లోగా దరఖాస్తు కార్యాలయంనకు చేరాలి.
🔥 దరఖాస్తు చేరవేయవలసిన చిరునామా :
జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి,.
RWS&S శాఖ,నోబుల్ కాలేజీ (PG) ఎదురుగా,రామానాయుడు పేట, మచిలీపట్నం- 521001, కృష్ణా జిల్లా – A.P
🔥 ఎంపిక విధానం :
విద్యార్హత లో వచ్చిన మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు :
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 30/04/2025.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.