భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ , పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ సంస్థ నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం, జీతం వంటి అన్ని అంశాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) , సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- మెకానికల్ – 150
- కెమికల్ – 60
- ఎలక్ట్రికల్ – 80
- ఎలక్ట్రానిక్స్ – 45
- ఇన్స్ట్రుమెంటేషన్ – 20
- సివిల్ – 45
🔥 విద్యార్హత :
- AICTE / UGC ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ / డీమ్డ్ యూనివర్సిటీ/ సంస్థ నుండి నోటిఫికేషన్ లో ప్రస్తావించిన విభాగంలో 60 శాతం మార్కుల తో బి.టెక్ / బి.ఈ/ బి.ఎస్సీ (ఇంజనీరింగ్) / 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M.Tech ఉత్తీర్ణత సాధించాలి.
- సంబంధిత విభాగంలో గేట్ – 2023 లేదా గేట్ – 2024 లేదా గేట్ – 2025 స్కోర్ కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 26 సంవత్సరాల లోపు వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు(అనగా 29 సంవత్సరాల వరకు), ఎస్సీ , ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు (అనగా 31 సంవత్సరాల వరకు), దివ్యాంగులు – జనరల్ వారికి 10 సంవత్సరాలు ( అనగా 36 సంవత్సరాల వరకు) వయోసడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు 30/04/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులను ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , ఓబీసీ, EWS, కేటగిరీ లకు చెందిన పురుష అభ్యర్థులు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- మహిళా అభ్యర్థులు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మాన్ , దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న వారిని గేట్ స్కోర్ ఆధారంగా 1:12 నిష్పత్తిలో పర్సనల్ ఇంటర్వ్యూ కొరకు పిలుస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వచించి , అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ లో జనరల్ అభ్యర్థులు 70 శాతం మార్కులు & మిగతా అందరూ 60 శాతం మార్కులు కనీస క్వాలిఫైడ్ స్కోర్ గా నిర్ణయించారు.
- ఈ నోటిఫికేషన్ ద్వారా తయారుచేసిన మెరిట్ లిస్టు 20 సెప్టెంబర్ 2025 వరకు వాలిడ్ గా వుంటుంది.
🔥 ఇంటర్వ్యూ షెడ్యూల్ & ఇంటర్వ్యూ కేంద్రం :
- జూన్ 9 నుండి 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ముంబై లోని అణుశక్తి నగర్, ఉత్తర ప్రదేశ్ లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్, తమిళనాడు లోని మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కర్ణాటక లోని కాగా జనరేషన్ పవర్ స్టేషన్.
- అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసేటప్పుడే ఇంటర్వ్యూ కేంద్రం యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
🔥 స్టైఫండ్ :
- ట్రైనింగ్ సమయంలో 74,000/- రూపాయల నెలవారి లభిస్తుంది. మరియు 30,000/- రూపాయల వన్ టైమ్ బుక్ అలవెన్స్ లభిస్తుంది.
- ట్రైనింగ్ పూర్తి అయ్యాక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నుండి సైంటిఫిక్ ఆఫీసర్ గా లెవెల్ – 10 పే స్కేల్ తో 56,100/- రూపాయల బేసిక్ పే తో పాటు 53 శాతం డియర్నెస్ అలవెన్స్ తో పాటు వివిధ అలవెన్స్ లు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు :
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 10/04/2025 (10:00 గంటల నుండి)
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 30/04/2025 (సాయంత్రం 04:00 గంటల లోగా)
- అభ్యర్థులు పూర్తి సమాచారం కొరకు క్రింద లింక్ లో ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ ను & అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు.