ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు ముఖ్య గమనిక ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క వివరాలను అప్డేట్ చేసుకునేందుకు గాను అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కుటుంబాల వారిగా డేటా ను కలిగి ఉంది. అయితే ఇందులో కొంత మంది ప్రజల వివరాలు అనగా పేరు , డేట్ ఆఫ్ బర్త్ , ఫోన్ నెంబర్, జెండర్ వంటి వివరాలలో తప్పులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
ఇందుకు గాను ప్రజలందరి వివరాలను డేటాబేస్ లో సరిగ్గా ఉండేందుకు గాను, సారూప్యత కొరకు అవకాశం కల్పిస్తూ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా EKYC నమోదు ప్రక్రియ ప్రారంభించింది.
🔥 ఎవరికి అవసరం ? :
హౌస్ హోల్డ్ డేటా లో నమోదు అయి ఉండి, డేటాబేస్ లో పౌరుల వివరాలు అనగా పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఫోన్ నెంబర్ వంటివి తప్పుగా ఉంటే వారు తప్పనిసరిగా గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా EKYC నమోదు చేసుకోవచ్చు.
🔥 EKYC చేసుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి ? :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన , పెట్టబోయే ఏ సంక్షేమ పథకాలకు అయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా నే ప్రామాణికంగా తీసుకుంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పౌరుల యొక్క డేటా తప్పుగా ఉంటే వీరు ఆ సంక్షేమ పథకాలకు అనర్హులు అయ్యే అవకాశం కలదు. దీనిని సరిదిద్దేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ద్వారా అందించే వివిధ కేటగిరీ – 1 సేవలు అనగా వివిధ సర్టిఫికెట్లు వీలైనంత త్వరగా మంజూరు అయ్యే విధంగా ఉపయోగపడును.
ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ సంక్షేమ పధకాల సమాచారం, విపత్తు నిర్వహణ హెచ్చరికలు & అలానే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఇతర సమాచారం వంటివి ప్రజలకు చేరవేసేందుకు మరింత అవకాశం కల్పిస్తుంది.
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా రైస్ కార్డ్ కుటుంబ సభ్యుల వివరాలను లైవ్ స్టేటస్ ను అప్డేట్ చేయుట కొరకు.
ప్రస్తుత డేటాబేసులో వున్న అసమతుల్యతను తొలగించి, పౌరుల యొక్క అన్ని ప్రయోజనాల నిమిత్తం ఏకీకృత ప్రత్యేక డేటాబేస్ ను నిర్వహించుట కొరకు.
🔥 EKYC ను ఏ విధంగా చేసుకోవాలి?
గ్రామ వార్డు సచివాలయం లో గల అందరూ ఉద్యోగులకు వారి GSWS EMPLOYEE MOBILE APPLICATION లో UPDATE EKYC ఆప్షన్ ను పొందుపరిచారు.
ఇందులో ఎవరికైతే EKYC నమోదు చేసుకోవాలి వారి పేర్లు ఉంటాయి లేదా వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి…EKYC నమోదు చేసుకోవచ్చు.
EKYC కొరకు పనిచేస్తున్న ఫోన్ నెంబర్ ఇవ్వవలసి వుంటుంది. OTP వెరిఫై చేసుకోవాలి.
ఈ క్రింది విధానాల ద్వారా EKYC నమోదు చేసుకోవచ్చు.
బయోమెట్రిక్
ఫేషియల్
ఐరిష్
OTP
🔥 EKY కొరకు చివరి తేదీ?
ఏప్రిల్ 20వ తేదీ లోగా EKYC నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి అని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాయల ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత సమాచారాన్ని మీకు తెలిసిన వారికి మన ఆర్టికల్ ద్వారా షేర్ చేసి, ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్ర ప్రభుతం పథకాలు & సర్వీసులు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వంటి వివరాలు కొరకు మన పేజీ ను ఫాలో అవ్వగలరు.