భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ క్రింద డిప్లొమా టెక్నీషియన్ & ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్), డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్), ఆపరేటర్ (ఫిట్టర్), ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్), ఆపరేటర్(మిషనిస్ట్), ఆపరేటర్( షీట్ మెటల్ వర్కర్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల కాలపరిమితి కి గాను ఈ భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపికా విధానం మొదలగు
పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
టెక్నీషియన్ & ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
డిప్లొమా టెక్నీషియన్ ( మెకానికల్) – 20
డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్) – 26
ఆపరేటర్ (ఫిట్టర్) – 34
ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్) – 14
ఆపరేటర్(మిషనిస్ట్) – 3
ఆపరేటర్( షీట్ మెటల్ వర్కర్) – 1
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా 98 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 విద్యార్హత :
డిప్లొమా టెక్నీషియన్ : సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
ఆపరేటర్: సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగం లో NAC/ NCTVT సర్టిఫికెట్ కలిగి వుండాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 50 శాతం మార్కులు కలిగి వుండాలి.& జనరల్ , ఓబీసీ, EWS అభ్యర్థులు 60 శాతం మార్కులు కలిగి వుండాలి.
🔥 వయస్సు :
28 సంవత్సరాల వయస్సు లోపు గల వారు అర్హులు.
ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు & PWBD వారికి 10 సంవత్సరాలు & Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
సంబంధిత ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీలు / టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI) ద్వారా స్పాన్సర్ చేయబడిన అభ్యర్థులు, HAL నుండి ప్రత్యేకమైన HAL రిఫరెన్స్ నంబర్‌తో కమ్యూనికేషన్ అందుకున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులను వ్రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. వ్రాత పరీక్ష ను బెంగళూరు లో నిర్వహిస్తారు.
🔥 వ్రాత పరీక్ష విధానం :
160 ప్రశ్నలకు గాను 2 ½ గంటలు సమయం కేటాయించారు.
మూడు భాగాలుగా విభజించారు. జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు & ఇంగ్లీష్ మరియు రీజనింగ్ 40 ప్రశ్నలు & సంబంధిత సబ్జెక్ట్ 100 ప్రశ్నలు వుంటాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు, ఎటువంటి నెగెటివ్ మార్కుల విధానం లేదు.
🔥 జీతం :
డిప్లొమా టెక్నీషియన్ గా ఎంపిక కాబడిన వారికి 23,000/- రూపాయల బేసిక్ పే తో , అన్ని అలవెన్సులు లు కలిపి 47,868/- రూపాయల జీతం లభిస్తుంది.
డిప్లొమా టెక్నీషియన్ గా ఎంపిక కాబడిన వారికి 22,000/- రూపాయల బేసిక్ పే తో , అన్ని అలవెన్సులు లు కలిపి 45,852/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 04/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 18/04/2025
👉 Click here for official website