ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ ప్రశాంతంగా నిర్వహించింది. రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల తప్పులను సరి చేసి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలి అని అభ్యర్థులు ఏపీపీఎస్సీ మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నప్పటికి రాష్ట్రంలో MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అభ్యర్థులుకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోలేమని ప్రకటించి ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అర్హత పొందగా వారిలో 86,459 మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 92 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
🏹 ప్రభుత్వ పాఠశాలలో గుమస్తా ఉద్యోగాలు – Click here
పరీక్ష రాసిన అభ్యర్థులు పేపర్-1 సులభంగా వచ్చింది అని, పేపర్-2 కొంచెం కఠినముగా వచ్చింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆదివారం నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు సంబంధించిన పేపర్ ‘కీ‘ ను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ‘ కీ ‘ పై ఏమైనా సందేహాలు ఉంటే ఫిబ్రవరి 25వ తేదీ నుండి 27వ తేదీ మధ్య ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యంతరాలు తెలుపవచ్చు.
మెయిన్స్ పరీక్షల ‘కీ’ విడుదల చేయడంతో ప్రస్తుతం కటాఫ్ మార్కుల కోసం చర్చ జరుగుతుంది. సబ్జెక్ట్ నిపుణుల అంచనాల ప్రకారం పేపర్-1 కటాఫ్ 120 , పేపర్-2 కటాఫ్ 110 ఉండే అవకాశం ఉంది.
✅ పేపర్-1 మరియు పేపర్-2 ప్రశ్నాపత్రాలు మరియు ‘కీ’ లను క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
🏹 Download Paper-1 Key – Click here
🏹 Download Paper-2 Key – Click here
🏹 Download Question Paper 1 – Click here
🏹 Download Question Paper 2 – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.