రైల్వే ఉద్యోగాల పరీక్షా తేదీలు ప్రకటించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు | Railway Exams | RRB ALP, JE, DMS, CMA 2nd Stage CBT Dates Announced

రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ముఖ్యమైన సమాచారం వచ్చింది.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన – 01/2024 మరియు 03/2024 నోటిఫికేషన్స్ యెుక్క సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలను మార్చి 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపింది

RRB విడుదల చేసిన 01/2025 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను మరియు 03/2024 నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్, డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ (రీసెర్చ్) మరియు మెటలర్జికల్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్చి 19, 20 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా విడుదల చేసిన నోటీసులో తెలిపింది.

  • ఫస్ట్ స్టేజ్ సిబిటి ఫలితాలు చివరి దశలో ఉన్నాయని, సెకండ్ స్టేజ్ సిబిట్ కీ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ త్వరలో పబ్లిష్ చేస్తామని బోర్డు తెలిపింది.

🏹 హైకోర్టులో 8వ తరగతి అర్హతతో మజ్దూర్ ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డ్ సూచనలు : 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష తేదీ మరియు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం పట్టణం వివరాలను పరీక్ష తేదీకి పది రోజులు ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. 
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ అధారిటీని పరీక్షకు పది రోజులు ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఈ కాల్ లెటర్ లను అభ్యర్థులు పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
  • అభ్యర్థి పరీక్షా కేంద్రంలోని హాల్ లోపలికి ప్రవేశించే ముందు ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ నిర్వహిస్తారు. 
  • రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్స్ లో చూడాలని తాజాగా విడుదల చేసిన నోటీసులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూచన చేసింది. 
  • ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మవద్దని, రిక్రూట్మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!