భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ అయిన RITES Ltd నుండి 300 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే భారతీయ పౌరులు ఆన్లైన్ విధానంలో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- RITES Ltd నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- RITES Ltd నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు :
- ఇంజనీర్ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.E / B.Tech విద్యార్హత ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు రెండేళ్ళ అనుభవం ఉండాలి.
- మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు B.E / B.Tech విద్యార్హతతో పాటు పది సంవత్సరాలు అనుభవం ఉండాలి.
🔥 జీతము వివరాలు :
- ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 41,241/- జీతము ఇస్తారు.
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 42,478/- జీతము ఇస్తారు.
- మేనేజర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 46,417/- జీతము ఇస్తారు.
- సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 50,721/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- ఇంజనీర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు.
- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.
- మేనేజర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
- సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 38 సంవత్సరాలు.
🔥 వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- UR / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 600/-
- SC , ST , PWD, EWS అభ్యర్థులకు అప్లికేషన్ 300/-
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- 30-01-2025 నుండి అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు 20-02-2025 తేది నుండి అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Notification Full Details – Click here