రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2024లో విడుదల చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ – 02/2024 యెుక్క పరీక్ష తేదీలను ప్రకటించింది.
ఈ పరీక్షలను మార్చి 2 నుంచి మార్చి 20వ తేదీ మధ్య నిర్వహిస్తామని వెల్లడించింది.
🏹 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 1642 ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
- అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్ష తేదీ మరియు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం పట్టణం వివరాలను పరీక్ష తేదీకి పది రోజులు ముందు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ అధారిటీని పరీక్షకు పది రోజులు ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ కాల్ లెటర్ లను అభ్యర్థులు పరీక్ష తేదీకి నాలుగు రోజులు ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థి పరీక్షా కేంద్రంలోని హాల్ లోపలికి ప్రవేశించే ముందు ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ నిర్వహిస్తారు.
- రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్స్ లో చూడాలని తాజాగా విడుదల చేసిన నోటీసులో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సూచన చేసింది.
- ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మవద్దని, రిక్రూట్మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది