AP ICDS ప్రాజెక్ట్స్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | పదో తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | AP Anganwadi Jobs Recruitment 2025

సొంత ఊరిలోనే ఉంటూ పదో తరగతి అర్హతతో ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడి సహాయకులుగా పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగాలకు కనీసం 21 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 పదో తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు – Click here

  • ప్రతి రోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలి అంటే మా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ చానల్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
  • పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 11 అంగన్వాడి సహాయక పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • మొత్తం 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • పాలకొండ డివిజన్ లో సీతంపేట ప్రాజెక్టు పరిధిలో రెండు, భామిని ప్రాజెక్టు పరిధిలో ఒక పోస్టు, కురుపాం ప్రాజెక్టు పరిధిలో ఆరు పోస్టులు ఉన్నాయి. 
  • పార్వతీపురం డివిజన్ లో పార్వతిపురం ప్రాజెక్టు పరిధిలో ఒకటి, సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఒక పోస్టు ఉన్నాయి.
  • ఈ 11 పోస్టులు కూడా షెడ్యూల్ ట్రైబల్ హ్యాబిటేషన్ లో ఉన్నాయి. కాబట్టి షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
  • గ్రామాల వారీగా ఖాళీలు వివరాలు కోసం సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించి తెలుసుకోవచ్చు.

🔥 ఈ ఉద్యోగాలను ఉండవలసిన అర్హతలు : 

  • ఈ అంగన్వాడి ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం పదో తరగతి అర్హత ఉండాలి. 
  • పదో తరగతి అర్హత ఉన్నవారు లేకపోతే అంతకంటే తక్కువ అర్హతలు ఉన్నవారిని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పిడి వెల్లడించారు, కాబట్టి తక్కువ విద్యార్హత ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు.
  • అంగన్వాడి ఉద్యోగాలకు అప్లై చేయడానికి స్థానిక వివాహిత మహిళలు అర్హులు. 
  • జూలై 1 , 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 21 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు (01-07-2024 నాటికి)
  • 21 సంవత్సరాలు వయసు ఉన్నవారు లేకపోతే 18 సంవత్సరాలు వయసు ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి 18 సంవత్సరాల వయసు నిండిన వారు కూడా ఈ పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాల (01-07-2024 నాటికి)

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ అంగన్వాడి సహాయకుల పోస్టులకు అర్హత ఉండేవారు 27-01-2025 సాయంత్రం ఐదు గంటల్లోపు సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.

🏹 ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here

🔥 ఇంటర్వ్యూ తేదీ & ప్రదేశము వివరాలు : 

  • అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ తేదీ మరియు ప్రదేశం వివరాలు తర్వాత తెలియజేస్తారు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • ఎంపిక ప్రక్రియ వంద మార్కులు ఉంటుంది. ఈ మార్కులు కేటాయింపు క్రింది విధంగా ఉంటుంది.
  • 10వ తరగతిలో ఉత్తీర్ణతకు 50 మార్కులు కేటాయిస్తారు.
  • ప్రీ స్కూల్ టీచర్ లేదా కృషి లేదా ప్రీస్కూల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు , గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ పొందినవారు లేదా ఈసీఈ వర్కర్ గా పనిచేస్తున్న వారికి ఐదు మార్కులు కేటాయిస్తారు.
  • వితంతువులకు 5 మార్కులు కేటాయిస్తారు.
  • మైనార్టీ తీరని పిల్లలు ఉన్న వారికి 5 మార్కులు కేటాయిస్తారు.
  • పూర్తి అనాధ, బాల సదన్ ప్రభుత్వ సంస్థలలో నివసించి మంచి నడవడిక , సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 5 మార్కులు కేటాయిస్తారు. 
  • దివ్యాంగులకు 5 మార్కులు కేటాయిస్తారు. 
  • మౌఖిక ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • ఈ ఉద్యోగాల ఎంపికలో పరీక్ష నిర్వహించరు. 

🔥 ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ విధానం :

అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.

🔥 అప్లికేషన్ కు జతపరచల్సిన సర్టిఫికెట్స్ : 

  1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
  2. కుల ధృవీకణ పత్రం
  3. విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
  4. నివాస స్థల ధ్రువీకరణ పత్రము
  5. వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  6. వికలాంగులు అయితే పీహెచ్ సర్టిఫికెట్
  7. వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
  8. ఆధార్ కార్డు
  9. రేషన్ కార్డు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!