Headlines

AP gramasachivalayam notification 2023 | ANM notification 2023 | telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో  వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవ్వబోతున్నాయి.ఇందులో భాగంగా ఎంతోమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ సచివాలయం నోటిిఫికేషన్ కూడా రానుంది. ఇందులో వివిధ రకాల పోస్ట్లు వున్నాయి.ANM పోస్ట్ కి సంబందించి సుమారు 2000 పోస్ట్లు వుండే అవకాశం వుంది.

సొంత జిల్లా లోనే పోస్టింగ్ వుంటుంది కావున ఈ పోస్టులకు అధిక ప్రాధాన్యత వుంది. ఈ ANM పోస్టులకు సంబంధించి అంశాలు అంటే అర్హతలు ఎంటి? పరీక్షా విధానం ఏ విధంగా వుంటుంది?

వివిధ అంశాలు అన్ని ఈ పోస్ట్ ద్వారా మీకు తెలియ చేయడం జరుగును.

ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడే వారిని ANM/మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) గా పిలుస్తారు. వీరు గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ సచివాలయం లో పనిచేయాల్సి వుంటుంది.

అర్హత: ఇండియన్ సిటిజన్స్ అయి వుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం వుంటున్న వారు అందరూ తగిన విద్యార్హత ,వయోపరిమితి కలిగి వుంటే అప్లై చేసుకోవచ్చు.

విద్యార్హత:

పోస్ట్ పేరు విద్యార్హతలు
ANM/మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్)a) పదవ తరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
b)AP నర్సింగ్ & మిడ్ వైవ్స్ కౌన్సిల్ నుండి 18/24 నెలల MPHA (F) కోర్స్ ను పూర్తి చేసి వుండాలి లేదా ఇంటర్మీడియట్ వాకేషనల్ లో మల్టీ పర్పజ్ హెల్త్ వర్కర్( ఫీమేల్) కోర్స్ తో పాటుగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ లేదా ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ చేసి వుండాలి.
c)AP యక్సలరీ నర్స్ అండ్ మిడ్ వైఫరి అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి వుండాలి.
d)ఇంటర్మీడియట్ వాకేషనల్ లో మల్టీ పర్పజ్ హెల్త్ వర్కర్( ఫీమేల్) చేసిన వారు A.P పారా మెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయివుండాలి.
e)ఫిజికల్ ఫిట్నెస్ వుండాలి.

పోస్టుల వివరాలు: సుమారు 2000 పోస్ట్లు వుండవచ్చు.

వయస్సు: 18 సంవత్సరాలు నిండి యుండి 42 సంవత్సరాల లోపు గల వారు అప్లై చేసుకోవచ్చు.

SC/ST/ BC వారు కి 5 సంవత్సరాలు,

PH వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి వుంటుంది.

అప్లై చేయు విధానం: ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి.ముందుగా OTPR జెనరేట్ చేసుకొని,తర్వాత అప్లై చేసుకొని ,ఫీజు పేమెంట్ చేయాలి.

పరీక్షా కేంద్రాలు:ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ జిల్లా లో పరీక్షా కేంద్రాలు వుంటాయి. మీ సొంత జిల్లాలోనే ఎగ్జామ్ రాయవచ్చు.

సెలక్షన్ విధానం: OMR ఆధారిత రాత పరీక్ష వుంటుంది.ఇందులో 150 MCQS వుంటాయి.150 మార్కులు.

ఇందులో 50 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు(పార్ట్ -A)

100 ప్రశ్నలు సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలు వుంటాయి.(పార్ట్ -B)

కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గా పనిచేస్తున్న వారికి వారి సర్వీస్ వారీగా మాక్సిమం 15 మార్కులు (10 శాతం) వెయిటైజ్ ఇస్తారు.

సిలబస్:

పార్ట్ -A:1. సాధారణ మానసిక సామర్థ్యం మరియు తార్కికం. 2. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌తో సహా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. 3. సాధారణ ఇంగ్లీష్.4. ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్.5. సాధారణ శాస్త్రం మరియు రోజువారీ జీవితంలో దాని అప్లికేషన్లు, సమకాలీనసైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి.6. APపై నిర్దిష్ట దృష్టితో భారతదేశ చరిత్ర & సంస్కృతి.7. భారత రాజకీయాలు మరియు పాలన: రాజ్యాంగ సమస్యలు, 73/74వ సవరణలు,పబ్లిక్ పాలసీ, సంస్కరణల ప్రకటన కేంద్రం – ఆంధ్రకు నిర్దిష్ట సూచనతో రాష్ట్ర సంబంధాలుప్రదేశ్8. సమాజం, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు.9. భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం.10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య సంక్షేమ & అభివృద్ధి పథకాలు.

పార్ట్ -B

సైన్సెస్:అనాటమీ మరియు ఫిజియాలజీ, మైక్రోబయాలజీ,మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం,పరిశుభ్రత- పోషణ.

ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ 1&2 (పేపర్ -1):

నర్సింగ్ I:(ఎ) నర్సింగ్‌తో పరిచయం

(బి) నర్సింగ్ ప్రొసీజర్స్ & టెక్నిక్స్(సి) ప్రథమ చికిత్స & అత్యవసర నర్సింగ్.

ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ II:(ఎ) పిల్లల ఆ

రోగ్యానికి పరిచయం (బి) తల్లి ఆరోగ్యానికి పరిచయం

కమ్యూనిటీ హెల్త్ హెల్త్ నర్సింగ్ -1&2: (ఏ)డొమిసిలియరీ మిడ్‌వైఫరీ

(బి) మంత్రసాని & ప్రసూతి నర్సింగ్
(సి) కుటుంబ నియంత్రణ & సంక్షేమం
పోషకాహార విద్య( డి)ఆరోగ్య విద్య(ఈ) కమ్యూనికేషన్ స్కిల్స్ & ఆడియో విజువల్ ఎడ్యూకేషన్

కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ -3:బేసిక్ మెడిసిన్ & ఫార్మకాలజీ- ఆరోగ్య సమస్యలు & ప్రణాళికలు- సంక్రమించే వ్యాధులు- మానసిక వ్యాధులు.

Notification – CLICK HERE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!