Headlines

పదో తరగతి అర్హతతో సొంత ఊరిలో జాబ్ చేయండి | AP Anganwadi Jobs Recruitment | Latest jobs in Andhrapradesh

ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా , కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత తో సొంత ఊరిలో ఉద్యోగం  పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మహిళా అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం.

🏹 AP లో ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్నమయ్య జిల్లా మహిళా , శిశు సంక్షేమ& సాధికారిత అధికారి వారు కార్యాలయం నుండి అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు , అంగన్వాడి సహాయకులు  మరియ మిని అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాల భర్తీ నిమిత్తం ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయం , అన్నమయ్య జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ ప్రకటించబడింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య: 116

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • అంగన్వాడి కార్యకర్తలు
  • అంగన్వాడి సహాయకులు
  •  మిని అంగన్వాడి కార్యకర్తలు

🔥 విద్యార్హత & మిగతా అర్హతలు:

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • తప్పనిసరిగా వివాహితురాలై వుండాలి.
  • స్థానిక నివాసితురాలై వుండాలి.

🔥  వయస్సు :

  • 21 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలు లోపు వయస్సు గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2024 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ కార్యాలయం వారికి దరఖాస్తు అందజేయాలి. దరఖాస్తు అందచేసి , రసీదు పొందవలెను.

🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవ పత్రాలు :

  • వయస్సు నిర్ధారణ కొరకు పుట్టిన తేది ధృవ పత్రం
  • కుల , నివాస స్థల ధ్రువీకరణ పత్రం
  • పుర్వానుభవం  వుంటే సంబంధిత ధృవ పత్రం
  • వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం
  • వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • అదనపు అర్హతలు వుంటే సంబంధిత ధృవ పత్రాలు
  • అన్ని ధృవపత్రాలు పై గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేసి , దరఖాస్తు తో పాటు జత చేసి , ఐసీడీఎస్ కార్యాలయం కి ఇవ్వాలి.

🔥 ఎంపిక విధానం :

  •  అభ్యర్థులను వారి మార్కుల యొక్క మెరిట్ మరియు ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక నిర్వహిస్తారు.
    1. 10 వ తరగతి ఉత్తీర్ణత కి 50 మార్కులు
    2. ప్రి స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి 5 మార్కులు
    3. వితంతువు అయితే 5 మార్కులు
    4. వితంతువు అయి, మైనర్ పిల్లలు అయితే 5 మార్కులు
    5. అభ్యర్థి అనాథ అయితే 10 మార్కులు
    6. దివ్యాంగులు అయితే 5 మార్కులు
    7. మౌఖిక ఇంటర్వ్యూ కి 20 మార్కులు కేటాయించారు.

🔥 జీతం:

  • ఎంపిక కాబడిన అంగన్వాడి కార్యకర్తలకు 12,000/- రూపాయల జీతం లభిస్తుంది.
  • ఎంపిక కాబడిన అంగన్వాడి ఆయాలకు 8,000/- రూపాయల జీతం లభిస్తుంది.

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • నోటిఫికేషన్ విడుదల తేది : 23/12/2024.
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 24/12/2024.
  • ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 02/01/2025.

👉  Click here to download notification 

👉 Click here to download application 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!