ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుండి ఈనెల ప్రారంభంలో విడుదలైన ఒక జీవో ప్రకారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెవిన్యూ డివిజన్ ల వారీగా నోటిఫికేషన్స్ ను ఆయా జిల్లాల్లో విడుదల చేస్తూ ఉన్నారు.
ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ రెవిన్యూ డివిజన్లో రేషన్ డీలర్ పోస్టు ఖాళీగా ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అభ్యర్థులపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదై ఉండకూడదు. స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు.
తాజాగా 152 పోస్టులతో రేషన్ డీలర్ల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. అర్హత ఉన్నవారికి తెలిసే విధంగా ఈ సమాచారాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తాజాగా తెనాలి రెవిన్యూ డివిజన్లో ఉన్న ఎనిమిది మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ రెవెన్యూ డివిజన్ లోని కాకుమాను, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, దుగ్గిరాల, కొల్లిపార , మంగళగిరి , తాడేపల్లి మండలాల్లో డీలర్ల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- రేషన్ డీలర్లు ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
- అభ్యర్థులపై సివిల్ లేదా క్రిమినల్ కేసులు నమోదై ఉండకూడదు.
- స్థానికంగా నివసించే ప్రజాప్రతినిధులు ఈ పోస్టులకు అర్హులు కాదు.
🔥 ఖాళీల సంఖ్య:
- మొత్తం 152 రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
- ఇందులో వివిధ కారణాల వలన ఖాళీగా ఏర్పడిన 81 రేషన్ డీలర్ల పోస్టులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేసిన చౌక దుకాణాల్లో 71 రేషన్ డీలర్ల పోస్టులను కలిపి భర్తి చేయడం జరుగుతుంది.
🔥 విద్యార్హత :
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండి, 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥దరఖాస్తు విధానం :
- అర్హత ఉన్నవారు తెనాలిలో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించి నేరుగా అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు.
🔥 అవసరమగు ధృవ పత్రాలు :
- 10 వ తరగతి , ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
- వయస్సు దృవీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం ( ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / పాన్ కార్డు వంటివి )
- కుల దృవీకరణ పత్రం
- మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- నిరుద్యోగిగా వుంటునట్లు స్వీయ దృవీకరణ పత్రం ( సెల్ఫ్ డిక్లరేషన్ )
- దివ్యాంగులు అయితే సంబంధిత ధృవ పత్రాలు.
🔥 జీతం :
- అభ్యర్థులు ఎంపిక కాబడిన రేషన్ డీలర్ పోస్ట్ కి ఫిక్స్డ్ సాలరీ నెలవారీ జీతం గా లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- దరఖాస్తు స్వీకరణ పూర్తి అయిన అనంతరం దరఖాస్తులను shortlist చేసి వారికి వ్రాత పరిక్ష నిర్వహిస్తారు.
- వ్రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు.
- వ్రాత పరీక్షకు హాజరయ్యేవారు ఒరిజినల్ ఆధార్ కార్డుతో వెళ్లాలి. వ్రాత పరీక్ష నిర్వహించే ప్రదేశం వివరాలు అభ్యర్థులకు పరీక్షకు రెండు రోజులు ముందు తెలియజేస్తారు. వ్రాత పరీక్ష నిర్వహించే సమయానికి గంట ముందుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- వ్రాత పరీక్ష లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ జాబితాను పరీక్ష రోజు సాయంత్రం విడుదల చేస్తారు.
- ఆ తర్వాత షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.
- ఇంటర్వ్యూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న పొదుపు భవనంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది :30/12/2024
- వ్రాత పరీక్ష నిర్వహణ తేది : 05/01/2025
- మౌఖిక పరీక్ష నిర్వహణ తేది : 06/01/2014