Headlines

ప్రభుత్వ షిప్ యార్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CSL Executive Notification 2024 | Latest jobs Notifications

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ , షిప్పింగ్ & వాటర్ వేస్ పరిధిలో గల భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నుండి పర్మినెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది.

వివిధ విభాగాలలో మొత్తం 44 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 1036 పోస్టులుతో రైల్వే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేస్తుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 44 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • వివిధ విభాగాలలో  పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

🔥 విభాగాల వారిగా ఖాళీల వివరాలు:

  1. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) – 20 
  2. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) – 4
  3. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) – 2 
  4. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (నావల్ ఆర్కిటెక్చర్) -6 
  5. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సివిల్) – 3 
  6. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)-2 
  7. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్) -4 
  8. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) – 3

🔥 విద్యార్హత

  • పైన పేర్కొన్న  మొదటి ఆరు విభాగాలు ( మెకానికల్ , ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ , నావల్ ఆర్కిటెక్చర్ , సివిల్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. హ్యూమన్ రిసోర్స్ , ఫైనాన్స్ ) వారికి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో  డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • హ్యూమన్ రిసోర్స్  విభాగం : ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో  మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
  • ఫైనాన్స్ విభాగం : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా / ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి ఫైనల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు

  • 27 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ & ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం  :

  • 40,000/- బేసిక్ పే తో  పాటు వివిధ  అలవన్స్ లతో మొత్తం 80280/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను రెండు దశలలో ఎంపిక చేస్తారు.
  1. ఫేజ్ – 1 :
    • ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. 60 మార్కులకు గాను 60 నిముషాలు కేటాయిస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ ( 5 మార్కులు ) , ఇంగ్లీష్ లాంగ్వేజ్ ( 5 మార్కులు ) న్యూమరికల్ ఎబిలిటీ ( 5 మార్కులు ), రీజనింగ్ ఎబిలిటీ ( 5 మార్కులు ) , సబ్జెక్టు ఆధారిత ( 40 మార్కులు ) వుంటాయి.

      2. ఫేజ్ – 2: 

  • గ్రూప్ డిస్కషన్ , రైటింగ్ స్కిల్స్ , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • వ్రాత పరీక్ష కి 60 మార్కులు , గ్రూప్ డిస్కషన్ కి 10 మార్కులు , రైటింగ్ స్కిల్స్ కి 10 మార్కులు , పర్సనల్ ఇంటర్వ్యూ కి  20 మార్కులు వెయిట్ ఏజ్ కలదు.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 06/12/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 06/01/2025

👉  Click here for official notification 

👉 Click here to apply online  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!