తెలంగాణ ప్రభుత్వం , ఐటిఇ & సి డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ESD) కమిషనర్ , హైదరాబాద్ వారి కార్యాలయం నుండి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగ భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ – Click here
రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఐటిఇ & సి డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ ( ESD) కమిషనర్ , హైదరాబాద్ వారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు.
విద్యార్హత :
- ఎంసీఏ / ఎం.టెక్ ( సిఎస్ఇ / ఐటి / ఈసిఈ ( ఎంబిఎ (ఐటి) వంటి పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా బి. టెక్ ( సిఎస్ఇ / ఐటి / ఈసిఈ ) ఉత్తీర్ణత సాధించాలి.
- ఐటి విభాగాలలో కనీసం రెండు సంవత్సరాలు పని చేసిన అనుభవం కలిగివుండాలి.
- ఇంగ్లీష్ భాషలో వ్రాయడం మాట్లాడడం లో నైపుణ్యం కలిగి వుండాలి.
వయస్సు :
- దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు వయస్సు 24 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల లోపు వుండాలి.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/01/ 2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వూ చేసి , ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ స్థలం :
- ESD Office , Road No 7 , Banjara hills , Hyderabad.
జీతం:
- ఎంపిక కాబడిన వారికి నెలకు 32,000/- రూపాయల జీతం లభిస్తుంది.
వర్క్ లొకేషన్ :
- భద్రాద్రి కొత్త గూడెం మరియు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదిలు :
- నోటిఫికేషన్ విడుదల తేది : 07-12-2024
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 09/12/2024.
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 22/12/2024
- కాల్ లెటర్ విడుదల తేది : 02-01-2024 ( ఈమెయిల్ ద్వారా పంపిస్తారు)
- ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 08/01/2025 ఉదయం 11:30 నిముషాల నుండి
Click here to download notification