భారత ప్రభుత్వం , హోం మంత్రిత్వ శాఖ పరిధిలో గల ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ( ఐటిబిపి ) సంస్థ హెడ్ కానిస్టేబుల్ ( మోటార్ మెకానిక్ ) & కానిస్టేబుల్ ( మోటార్ మెకానిక్ ) ఉద్యోగాలు భర్తీ కొరకు అర్హత గల పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పదవ తరగతి ,ఇంటర్మీడియట్ విద్యార్హత తో ఈ ఉద్యోగాలను పొందవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 త్వరలో 8000 VRO ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 10th, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఇండొ టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ( ఐటిబిపి ) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 51
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్ ) – 07
- కానిస్టేబుల్ ( మోటార్ మెకానిక్ ) – 44
🔥 విద్యార్హత :
1)హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుండి 10+2 ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- గుర్తింపు పొందిన సంస్థ లేదా ఐటిఐ నుండి మోటార్ మెకానిక్ లో ఉత్తీర్ణత మరియు వర్క్ షాప్ లో 3 సంవత్సరాల అనుభవం లేదా 3 సంవత్సరాల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
2) కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్ ):
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా బోర్డు నుండి 10 వ తరగతి ఉత్తీర్ణత
- సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్
- సంబంధిత రంగం లో 3 సంవత్సరాల అనుభవం.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు , PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ తేది గా 06/11/2024 ను నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ , ఓబీసీ , EWS అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ, Ex – సర్వీస్ మాన్ వారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం :
- హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 25,500/- రూపాయల నుండి 81,100/- రూపాయల గా గల పే స్కేల్ వర్తిస్తుంది.
- కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 21,700/- రూపాయల నుండి 69,100/- రూపాయల గా గల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- ఎంపిక విధానం లో ఈ క్రింది అంశాలు కలిగి వుంటాయి.
అవి
1) ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
2) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
3) వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్
4) వ్రాత పరీక్ష
5) స్కిల్ టెస్ట
6) మెడికల్ పరిక్ష ను కలిగి వుంటాయి
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 24/12/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 22/01/2025
👉 Click here for official website