గ్రామీణ ఆరోగ్య సంస్థలో 10th, 12th, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | ICMR – NIOH Assistant, Attendant, Technician Recruitment 2024

కేంద్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చెందిన ICMR – NIOH (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్) అనే సంస్థ నుండి పర్మినెంట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ : 11-12-2024

  • నోటిఫికేషన్ వివరాలు అన్ని తెలుసుకొని , మీరు పూర్తి నోటిఫికేషన్ PDF Download చేయడానికి మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కోసం చివరి వరకు ఈ ఆర్టికల్ చదవండి. 
  • ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

 🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ  – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ICMR – NIOH ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

🔥 భర్తీ చేయబోయే పోస్టులు  :

  • ICMR – NIOH విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్, టెక్నీషియన్-1, లేబరేటరీ అటెండెంట్-1 అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ICMR – NIOH విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 
  • టెక్నీషియన్-1 ఉద్యోగాలకు 12th లేదా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత పొంది DMLT లేదా కంప్యూటర్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీలో కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
  • లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 50% మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రభుత్వ లేదా రిజిస్టర్డ్ లాబరేటరీలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసిన వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥  వయస్సు :

  • అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. 
  • టెక్నీషియన్-1 ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు 
  • లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు

🔥 వయసులో సడలింపు : 

  • UR పోస్టులకు అప్లై చేసే రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తించదు. రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలకు మాత్రమే వయసులో సడలింపు వర్తిస్తుంది.
  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జీతము :

  • అసిస్టెంట్ ఉద్యోగాలకు 35,400/- నుండి 1,12,400/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • టెక్నీషియన్ ఉద్యోగాలకు 19,900/- నుండి 63,200/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • లేబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 11-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ఫీజు : 

  • UR / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 1000/-
  • SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు ఫీజు 500/-

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే .అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Apply Online – Click here 

👉 Download Full Notification – Click here  

👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!