ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ నుండి అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 25 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 28
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 25
🔥 అర్హత :
- బ్యాంకింగ్ లేదా కామర్స్ లేదా అకౌంటింగ్ మరియు ఆడిట్ లేదా అగ్రికల్చర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి.
🔥 వయస్సు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు.
🔥 వయస్సులో సడలింపు :
- క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం :
- ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా www.nats.education.gov.in Online లో అప్లై చేయాలి.
- తర్వాత అభ్యర్థులు నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ ను నింపి పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
The Deputy General Manager, Human Resource Department, The Andhra Pradesh State Cooperative Bank Ltd, NTR Sahakara Bavan, Governorpet, Vijayawada – 520002
🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం :
ఒక సంవత్సరం On job Training ఇస్తారు.
🔥 స్టైఫండ్ : 15,000/-
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 28-10-2024
🔥 డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ : 02-11-2024
🔥 పోస్టింగ్ ప్రదేశం : కృష్ణ , ఎన్టీఆర్, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల్లో పోస్టింగ్ ఇస్తారు.
🏹 Download Full Notification – Click here
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.