ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో ) కి చెందిన సంస్థ .
ఈ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది ..
ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆగస్టు 4 నుండి ఆగస్టు 24వ తేదీ లోపు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .
నోటిఫికేషన్ ద్వారా నర్స్ , ఫార్మసిస్ట్ , లాబ్ టెక్నీషియన్ , కుక్ , క్యాటరింగ్ అసిస్టెంట్ , అసిస్టెంట్ , డ్రైవర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు పదో తరగతి వంటి అర్హతలతో పాటు వివిధ రకాల కోర్సులు చేసిన వారు అప్లై చేయవచ్చు .
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి . పోస్టును బట్టి గరిష్టంగా 35 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంది.
అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో సడలింపు కూడా ఇస్తున్నారు . అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు ..
అర్హత గల అభ్యర్థులు ఎన్ని రకాల పోస్టులకు అయినా అప్లై చేయవచ్చు అయితే అప్లై చేయాలనుకున్న ప్రతి పోస్ట్ కు వేరువేరుగా దరఖాస్తు చేయాలి.
పరీక్ష కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు , తిరుపతి, విశాఖపట్నం తో పాటు హైదరాబాద్ మరియు దేశంలోని వివిధ ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత వారి నుండి షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు పోస్టులను బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు .
ఈ పోస్టుల ఎంపికలో స్కిల్ టెస్ట్ లో క్వాలిఫై అయితే సరిపోతుంది. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపిక ఉంటుంది .
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ ను చదివి అర్హత ఆసక్తిగల ఉద్యోగాలకు త్వరగా ఆన్లైన్లో అప్లై చేయండి . ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 24 సాయంత్రం 5:00 వరకు సమయం ఇచ్చారు.