మన రాష్ట్రంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | CCI Recruitment 2024 | CCI Office Assistant Recruitment 2024 | Latest Govt Jobs Recruitment 2024

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో వరంగల్ లో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో 85 రోజులు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు అక్టోబర్ 16వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ఇంటర్వ్యూకు అప్లికేషన్ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలి.

రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, వరంగల్ నుండి విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ (అకౌంట్స్) , ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్), ఆఫీస్ స్టాఫ్ క్లరికల్ వంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు.

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 విద్యార్హత : 

  • ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలకు బిఎస్సి (అగ్రికల్చర్) లేదా ఎంబీఏ (అగ్రికల్చర్) పూర్తి చేసిన వారు అర్హులు. 
  • ఆఫీస్ అసిస్టెంట్ (క్లరికల్) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 
  • ఆఫీసు అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాలకు బీకాం పూర్తి చేసిన వారు అర్హులు.
  • ఆఫీసు అసిస్టెంట్ (జనరల్) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

🏹 తెలంగాణలో 3,967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతం : 

  • ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలకు 37,000/- జీతం ఇస్తారు. 
  • ఆఫీస్ అసిస్టెంట్ (క్లరికల్) ఉద్యోగాలకు 25,500/- జీతం ఇస్తారు. 
  • ఆఫీసు అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాలకు 25,500/- జీతం ఇస్తారు.
  • ఆఫీసు అసిస్టెంట్ (జనరల్) ఉద్యోగాలకు 25,500/- జీతం ఇస్తారు. 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 16-10-2024

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : General Manager The Cotton Corporation of India Limited, 2nd & 3rd Floor, Laxmipuram, Near Old grain Market, WARANGAL -506002

🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!