Telangana Jobs Calendar 2024-2025 | తెలంగాణలో 3,967 ఉద్యోగాలు భర్తీ – ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ | Telangana Jobs

తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో 3,967 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మూడు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఉద్యోగాల భర్తీకి అర్హత గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 

ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 1284 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు, 2050 నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మరియు 633 ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎప్పటినుంచో ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు పక్క ప్రణాళికతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. విడుదల చేసిన మూడు నోటిఫికేషన్లు ఉద్యోగాల పరీక్ష తేదీలను కూడా ప్రకటించడం జరిగింది. వీటికి సంబంధించిన పరీక్షలు నవంబర్ లో నిర్వహించబోతున్నారు. 

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నవంబర్ 10వ తేదీన, నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నవంబర్ 17వ తేదీన, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు నవంబర్ 30వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి 👇 👇 👇 

🔥 ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ: తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు నర్సింగ్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ లను విడుదల చేయడం జరిగింది. 

🔥 ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు : 

  • నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. 
  • ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు డి.ఫార్మసీ లేదా బీ.ఫార్మసీ లేదా Pharm.D పూర్తి చేసిన వారు అర్హులు.
  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఒకేషనల్ MLT, DMLT , BSc (MLT) మరియు ఇతర అర్హతలు ఉన్నవారికి కూడా అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. 
  • అంతేకాకుండా అభ్యర్థులు సంబంధిత కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తిచేసుకుని ఉండాలి.

🔥 అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు : 

  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. 
  • నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.
  • ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అక్టోబర్ 5వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు అప్లై చేయవచ్చు.

🔥 పరీక్ష తేదీలు : 

  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నవంబర్ 10వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
  • నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నవంబర్ 17వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
  • ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 ఉద్యోగాలకు నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపాయలు చెల్లించాలి. 

  • ఇతర రాష్ట్ర అభ్యర్థులు అయితే ఎగ్జామినేషన్ ఫీజు తో పాటు ప్రాసెసింగ్ ఫీజు 200/- రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

🔥 ఎంపిక విధానము : ఈ ఉద్యోగాల ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు.

  • ఇందులో 80 పాయింట్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. 
  • 20 పాయింట్లు గతంలో కాంట్రాక్టుగా అవుట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, ప్రోగ్రాం లలో పనిచేసిన వారికి వెయిటిజి మార్కులు ఇస్తారు.

🔥 పరీక్ష విధానం : 

  • 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రశ్నలు అభ్యర్థులు అప్లై చేసిన ఉద్యోగాల అర్హతకు సంబంధించిన సిలబస్ నుండి ఇస్తారు. 
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది..
  • పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. 
  • పరీక్ష ఇంగ్లీషులో నిర్వహిస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు : 

  • హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మరియు నర్సంపేట ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. 
  • అభ్యర్థులు తాము అప్లై చేసే సమయంలో పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

🏹 ఈ నోటిఫికేషన్స్ కు సంబంధించిన మరికొన్ని వివరాలు కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ వారి ఉన్న లింకులపై క్లిక్ చేయండి..

ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వివరాలు – Click here 

నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు – Click here 

ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వివరాలు – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!