Headlines

తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TTD Outsourcing Jobs Recruitment 2024 | TTD Latest Jobs Recruitment 2024

తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి హార్ట్ సెంటర్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు హిందూ మతం వారు మాత్రమే అర్హులు.

అర్హత ఉన్నవారు స్వయంగా అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనగా విద్యార్హతల సర్టిఫికెట్స్ , అనుభవము, వయస్సు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రము వంటి డాక్యుమెంట్స్ మరియు ఒక సెట్టు జిరాక్స్ కాపీలతో తో స్వయంగా అక్టోబర్ 1వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము , జీతము, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా అక్టోబర్ 1వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్

🔥 భర్తీ చేస్తున్న పోస్టుల పేర్లు : హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, ఎకో టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్, జూనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మరియు పెర్ఫ్యూజనిస్ట్ అని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

🔥 అర్హతలు : క్రింది తెలిపిన విధంగా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08

🔥 గరిష్ట వయస్సు : గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : పోస్టులను అనుసరించి క్రింది విధంగా జీతం ఉంటుంది. 

  • హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ – 30,000/-
  • ఎకో టెక్నీషియన్ – 21,500/-
  • అనస్థీషియా టెక్నీషియన్ – 21,500/-
  • సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ – 66,552/-
  • జూనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ – 41,476/-
  • పెర్ఫ్యూజనిస్ట్ – 35,000/-

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా అక్టోబర్ ఒకటవ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 01-10-2024

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

  • అర్హత పరీక్షలో వచ్చిన ప్రతి 10% మార్కులకు ఒక మార్కు కేటాయిస్తారు.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, తిరుపతి

🔥 ఫీజు : లేదు

🏹 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. 👇 👇 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!