నర్సింగ్ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NORCET 4 ఫలితాలను విడుదల చేశారు .
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో మరియు సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం NORCET 4 నోటిఫికేషన్ విడుదల చేశారు .
మొత్తం 3,055 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది .
ఈ సంవత్సరం మే 5 వరకు ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు .
దీనికి సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్ 3న నిర్వహించడం జరిగింది .
ఫలితాలను జూలై 18న విడుదల చేశారు .
ఈ పరీక్షలో మొత్తం 2668 మంది క్వాలిఫై అయ్యారు .
🔥 క్వాలిఫై అయిన వారిలో అన్ రిజర్వుడ్ కేటగిరీకి చెందినవారు 226 మంది , ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి చెందినవారు 62 మంది , ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కు చెందిన అభ్యర్థులు 1105 మంది , ఎస్సీ క్యాటగిరీకి చెందిన అభ్యర్థులు 1054 మంది , ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 221 మంది ఉన్నారు .
ప్రస్తుతం ఈ ఫలితాలను మెరిట్ వారీగా కాకుండా రోల్ నెంబర్ వారీగా విడుదల చేశారు .
🔥 ఫలితాలు చెక్ చేయడానికి మరియు క్వాలిఫై అయిన అభ్యర్థులు వారికి వచ్చిన మార్కులు వివరాలు కోసం క్రింద ఉన్న పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి .
✅ Official Website – Click here
✅ Qualified Candidates List – Click here