Headlines

AP Police Recruitment 2024 | AP Police Constable Recruitment 2024 | రెండు మూడు రోజుల్లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్. 

రాష్ట్రంలో 2022 నవంబర్ లో విడుదల చేసిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కసరత్తు చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి న్యాయపరమైన చిక్కులన్నీ అధిగమించిన పోలీస్ శాఖ రెండు, మూడు రోజుల్లో ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల చేయబోతుంది. ఈ రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మరో 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి హైదరాబాదులో ఉన్న రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో చెప్పించిన క్లాసుల కోర్సు మా యాప్ లో ఉంది.. ఈ కోర్సు పేద విద్యార్థుల కోసం 499/- రూపాయలకే ఇస్తున్నాం.. మీరు డెమో క్లాసెస్ చూసి ఈ క్లాసులు తీసుకోవచ్చు. 

SSC, బ్యాంక్, రైల్వే , గ్రూప్స్ మరియు ఇతర ఆన్లైన్ క్లాసెస్ కోర్సులు కూడా 499/- Only 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఇలా ఉన్నాయి👇 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది ? 

2022 నవంబర్ చివరి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు 

🔥 ఎంతమంది అప్లై చేశారు : మొత్తం నాలుగు లక్షల యాబై ఎనిమిది వేల మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. 

🔥 ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహించారు : ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష 2023 జనవరి చివరి వారంలో నిర్వహించారు. 

🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : అత్యంత వేగంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించారు. 

🔥 ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారి సంఖ్య : మొత్తం 95,208 మంది ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 

🔥 గతంలో ప్రకటించిన దేహదారుఢ్య పరీక్ష తేదీలు : మార్చి 13 నుండి 20వ తేదీ మధ్య దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని గతంలో హాల్ టికెట్స్ కూడా జారీ చేశారు. 

🔥 దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకపోవడానికి గల కారణాలు : ఈ పరీక్షలు నిర్వహించాలి అనుకున్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండడంతో ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డాయి. 

🔥 న్యాయపరమైన చిక్కును ఏర్పడడానికి గల కారణాలు : గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు 15% , ఏపీఎస్పీ హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇవ్వడం కారణంగా 6,100 ఉద్యోగాల్లో 1100 ఉద్యోగాలు హోంగార్డులకే వస్తాయి. అయితే వీరిలో ప్రిలిమ్స్ పరీక్షకు 3000 మంది హాజరు కాగా 400 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో తమకు కటాఫ్ మార్కులు తగ్గించాలని హోంగార్డులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ చిక్కు ఏర్పడింది. 

🔥 కొత్తగా 20,000 ఉద్యోగాలు : రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు కొద్దిరోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో 20వేల వరకు ఖాళీలు ఉన్నట్టుగా ప్రకటించారు. కాబట్టి ప్రస్తుతం రిక్రూట్మెంట్ మధ్యలో ఉండిపోయిన నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఈ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాం. కాబట్టి మీరు ప్రతిరోజు www.inbjobs.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!