ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,500 మంది రేషన్ డీలర్స్ నియామకాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్స్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఈ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయబోతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ వలన ఉపయోగం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్న సమయంలో కార్డుదారులు రేషన్ పంపిణీ కోసం పనులు మానుకొని ఎదురుచూడాల్సి రావడం, రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు ఇంటి వద్ద లేకపోతే రేషన్ కోసం రేషన్ షాప్ వద్దకు వెళ్లి రేషన్ తీసుకోవలసి రావడంతో రేషన్ షాపులు ద్వారానే మళ్లీ సరఫరా చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ పంపిణీ వ్యవస్థతో ఉపయోగం లేదని భావిస్తున్న ప్రభుత్వం చౌక దుకాణాలు వ్యవస్థను బలోపేతం చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నచోట కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 4000 కొత్త చౌక దుకాణాలు ఏర్పాటు చేయాలని అంచనా వేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే RPF, NTPC, Group D, ALP, Technicians , JE ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
వీటితో పాటు బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,796 చౌక దుకాణాలు ఉండగా అందులో 6,500కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు కూడా రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదిగిన నియమించేందుకు చర్యలు చేపట్టింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణాల్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న 6,500 ఖాళీలతో పాటు కొత్త చౌక దుకాణాల్లో 4000 రేషన్ డీలర్ల నియామకాలు కూడా చేపట్టాల్సి ఉంది. మొత్తం 10,500 రేషన్ డీలర్స్ నియామకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.