ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఉద్యోగాలు భర్తీకి చేపట్టాల్సిన సంస్కరణలపై గత ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు రాజస్థాన్ మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా పరిశీలించి ఒక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందించబోతుంది.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
నివేదికలో కొన్ని కీలకమైన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు. ఇందులో ముఖ్యమైనవి…
- ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని , వివిధ శాఖల్లో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలు వివరాలను అందిలా కొత్త ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించబోతున్నారు.
- కేరళ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విధానం లేదు. కానీ ఆయా శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వ అనుమతి లేకుండానే ఖాళీలు వివరాలు సంబంధిత శాఖల నుండి డైరెక్ట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- ప్రభుత్వ ఉద్యోగాలను ఆరు సర్వీసులుగా వర్గీకరించాలని ప్రతిపాదిస్తున్నారు
- ఉద్యోగాలు భర్తీ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు వివరాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన ద్వారా వెబ్ పోర్టల్ ద్వారా నిర్దేశిత నమూనాలో పంపించాలి.
- జాబ్ క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో 3rd పార్టీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలి.
- ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న విధంగానే అక్కడికక్కడే స్క్రీన్ పైన మార్కులు తెలిపే విధానాన్ని అనుసరించాలి. రాజస్థాన్ లో ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు.
- ఇప్పటివరకు ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో నిరుద్యోగులు చెల్లించే ఫీజు ప్రభుత్వానికి చేరుతుంది. ఇలా కాకుండా నిరుద్యోగులు చెల్లించే ఫీజు ఏపీపీఎస్సీకి చేరే విధంగా మార్పులు చేయాలి.
- దీంతోపాటు మరికొన్ని ప్రభుత్వ పాదనలు కమిటీ పరిశీలనలో ఉన్నాయి. ఇవన్నీ నివేదికలో పేర్కొని ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వబోతుంది.
- నివేదికపై పూర్తి పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని త్వరలో ఉద్యోగాలు ప్రతి ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.