ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోస్టు ఆఫీసులలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 2,336 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1355 పోస్టులు , తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 44,228 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. చివరి తేది 05-08-2024
కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారికి తాము నివసిస్తున్న గ్రామంలో ఖాళీ ఉంటే అక్కడే పోస్టింగ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. లేదా తమ జిల్లాలోనే దగ్గరగా ఉండే పోస్టు ఆఫీస్ లో ఉద్యోగం పొందవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత సమాచారం 👇 👇 👇
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ , బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 అర్హత : 10th పాస్
🔥 వయస్సు : 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతము : ఈ పోస్టులకు క్రింది విధంగా జీతము ఉంటుంది.
- BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
- ABPM / Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/-
🔥 ఫీజు : 100/-
- SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లై విధానం : అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 15-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024
🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులకు దగ్గరగా ఉండే లొకేషన్ లో పోస్టింగ్ పొందవచ్చు.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అప్లై చేయండి.