Headlines

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | APSRTC Recruitment 2024 | APSRTC Latest Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.

🔥 పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏ.పి.యస్.ఆర్.టి.సి. నందు అప్రెంటిస్ షిప్ చేయుటకు ఆసక్తి కలిగి, ఈ క్రింద కనపరచిన ట్రేడ్ల నందు IT.I ఉత్తీర్ణులైన వారు 01-08-2024 వ తేదీ నుండి ఆన్లైన్ లో వెబ్ సైట్ అడ్రస్ నందు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 చివరి తేదీ : 16.08.2024 వ తేది లోపు ఈ పోస్టులకు అప్లై చేయాలి .

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ విజయనగరం లో ఉన్న స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ నుండి విడుదలైంది. 3 జిల్లాల్లో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు : 

  1. పార్వతీపురం మన్యం జిల్లాలో డీజిల్ మెకానికల్, మోటార్ మెకానిక్ , ఎలక్ట్రీషియన్ , వెల్దర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్ ట్రేడ్స్ లో ఖాళీలు ఉన్నాయి.
  2. విజయనగరం జిల్లాలో డీజిల్ మెకానిక్ , మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ సివిల్
  3. శ్రీకాకుళం జిల్లాలో డీజిల్ మెకానిక్ , మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మెన్ సివిల్

🔥 అర్హతలు : సంబంధిత ట్రేడ్ లో I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు , తమ పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ నందు నమోదు చేసుకొన్న తర్వాత వారు వెబ్ సైట్ నందు “login” అయ్యి వారు అప్రెంటిస్ షిప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. 

🔥 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివరాలు : ఏ.పి.యస్.ఆర్.టి.సి నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు ఎ.పి.యస్.ఆర్.టి.సి జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, వి.టి అగ్రహారం , విజయనగరం నందు హాజరు కావాలి.

వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ.118/- రుసుము చెల్లించి , తగు రసీదు పొంది అప్లికేషన్ కు జతపరిచి జోనల్ స్టాఫ్ కాలేజ్ విజయనగరం నందు అప్లికేషన్ అందజేయాలి. 

🔥 వెరిఫికేషన్ జరిగే తేదీలు : 

  • పార్వతీపురం మన్యం జిల్లా – 22/08/2024
  • విజయనగరం జిల్లా – 23/08/2024
  • శ్రీకాకుళం జిల్లా – 27/08/2024

ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్ లో ఖాళీలు లేనియెడల వేరే జిల్లాలో పనిచేసేందుకు సమ్మతి తెలుపుతూ వ్రాసి ఇవ్వాలి. 

Note : ఈ పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే 08922 294906 అనే నెంబర్ కు కాల్ చేసి సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!